Friday, March 17, 2017

Entamatramuna evvaru



ఎంతమాత్రమున నెవ్వరు దలచిన అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచిచూడ పిండంతేనిప్పటియన్నట్లు కొలుతురు మిమువైష్ణవులు కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు తలతురు మిము శైవులు తగినభక్తులను శివుడనుచు అలరిపొగడుదురు కాపాలికులు ఆది భైరవుడవనుచు సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు దరిశనములు మిము నానావిధులను తలపుల కొలదుల భజింతురు సిరులమిమ్మునే యల్పబుద్ధి దలచిన వారికి నల్పంబవుదువు గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు నీవలన గొరతేలేదు మరి నీరుకొలది తామెరవు ఆవల భాగీరథిదరి బావుల ఆజలమే వూరినట్లు శ్రీవేంకటపతి నీవైతే మము జేకొని వున్నదైవమని యీవలనే నీశరణని యెదను యిదియే పరతత్త్వమునాకు






Tuesday, May 3, 2016

Dasarathi Satakam

Dasarathi Satakam (దాశరథీ శతకము) is a Telugu Bhakti Satakam, written by Bhakta Ramadasu (Kancharla Gopanna) during 17th century. It consists of 104 poems. Dasarathi means son of Dasaratha, who is the Hindu king Sri Rama. The makutam for all the poems at the end dASarathee karuNApayOnidhee! (O son of Dasaratha, the ocean of mercy)

శ్రీ రఘురామ, చారు తులసీదళ దామ, శమక్షమాది శృం
గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్యరమాలలామ, దు
ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో
త్తారక నామ, భద్రగిరి దాశరధీ, కరుణా పయోనిధీ!

Oh Lord Sriram, with the garland of pious tulasi leaves;
Glowing with forgiveness; possessor of bravery praised by 
Three worlds; killer of kabandha; protector from evil wills;  
Son of Dasarath staying in Bhadragiri; an ocean of kindness!   
(salutations to You!).

Sunday, December 27, 2015

Antayu Neeve

Antayu Neeve Hari Pundarikaksha





Pa|| antayu neeve hari punDarIkAksha
       centa naaku neevE SreeraghurAma

Ca|| kulamulu neevE govinduDA
       naa .. kalimiyu neeve karuNAnidhE
       talapulu neeve dharanidhara
      naa.. nelavulu neeve neerajanAbha..


      tanuvunu neeve dAmoadarA..
      naa.. manikiyu neeve madhusUdana
      vinikiyu neeve viThaluDA
      naa.. venaka mundu neeve vishNu dEvuDA..


      puTTuvu neeve purushOttama
      kona.. naTTanadumu neeve nArAyaNA..
      iTTE SrI vEnkaTESvaruDA..
     naaku... neTTela gati inka neevE neevE..


      అంతయు నీవె హరి పుండరీకాక్ష
      చెంత నాకు నీవే శ్రీరఘురామ


     కులములు నీవే గొవిందుడా
     నా .. కలిమియు నీవె కరుణానిధే
    తలపులు నీవె ధరనిధర
    నా.. నెలవులు నీవె నీరజనాభ..

    తనువును నీవె దామోదరా..
    నా.. మనికియు నీవె మధుసూదన
    వినికియు నీవె విఠలుడా
    నా.. వెనక ముందు నీవె విష్ణు దేవుడా..

    పుట్టువు నీవె పురుషోత్తమ
    కొన.. నట్టనదుము నీవె నారాయణా..
    ఇట్టే శ్రీ వేంకటేశ్వరుడా..
    నాకు... నెట్టెల గతి ఇంక నీవే నీవే..






Wednesday, March 18, 2015

Rama Nannu Brovara

Rama Nannu Brovara



rAma nannu brOvarA
vEmakO lOkAbhi rAma nannu brOvarA

cheemalO brahmalO
Siva kESavAdulalO ||
prEma meera melugu chunDE
birudu vahinchina sItA ||rAma nannu brOvarA||

meppulakai kanajaavu naaku baDaga virraviigi 
tappu panulu lEka unDE tyAgarAja vinuta sItA || rAma nannu brOvarA|| 


రామ నన్ను బ్రోవరా
వేమకో లోకాభి రామ నన్ను బ్రోవరా

చీమలో బ్రహ్మలో
శివ కేశవాదులలో ||
ప్రేమ మీర మెలుగు చుండే
బిరుదు వహించిన సీతా ||రామ నన్ను బ్రోవరా||

మెప్పులకై కనజావు నాకు బడగ విర్రవీగి 
తప్పు పనులు లేక ఉండే త్యాగరాజ వినుత సీతా || రామ నన్ను బ్రోవరా || 



Saturday, February 14, 2015

Madhurashtakam

Madhurashtakam



adharam madhuram vadanam madhuram
nayanam madhuram hasitam madhuram
hRdayam madhuram gamanam madhuram 
mathurA dhipate rakhilam madhuram

vacanam madhuram caritam madhuram
vasanam madhuram valitam madhuram
calitam madhuram bhramitam madhuram
mathurA dhipate rakhilam madhuram

vEnur madhurO rEnur madhuraha@h 
pAnir madhuraha@h pAdau madhuraha@h 
nRtyam madhuram sakhyam madhuram 
mathurA dhipate rakhilam madhuram

gItam madhuram pItam madhuram
bhuktam madhuram suptam madhuram
rUpam madhuram tilakam madhuram
mathurA dhipate rakhilam madhuram

karanam madhuram taranam madhuram
haranam madhuram smaranam madhuram
vamitam madhuram samitam madhuram
mathurA dhipate rakhilam madhuram

gumjA madhurA mAlA madhurA
yamunA madhurA vIcI madhurA
salilam madhuram kamalam madhuram
mathurA dhipate rakhilam madhuram

gOpI madhurA lIlA madhurA
yuktam madhuram bhuktam madhuram
dRshtam madhuram sishtam madhuram
mathurA dhipate rakhilam madhuram

gOpA madhurA gAvO madhurA
yashTir madhurA sRshTir madhurA 
dalitam madhuram phalitam madhuram
mathurA dhipate rakhilam madhuram


అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం 
మథురా ధిపతె రఖిలం మధురం

వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురం
చలితం మధురం భ్రమితం మధురం
మథురా ధిపతె రఖిలం మధురం

వేనుర్ మధురో రేనుర్ మధురహః 
పానిర్ మధురహః పాదౌ మధురహః 
నృత్యం మధురం సఖ్యం మధురం 
మథురా ధిపతె రఖిలం మధురం

గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం మధురం
రూపం మధురం తిలకం మధురం
మథురా ధిపతె రఖిలం మధురం

కరనం మధురం తరనం మధురం
హరనం మధురం స్మరనం మధురం
వమితం మధురం సమితం మధురం
మథురా ధిపతె రఖిలం మధురం

గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచీ మధురా
సలిలం మధురం కమలం మధురం
మథురా ధిపతె రఖిలం మధురం

గోపీ మధురా లీలా మధురా
యుక్తం మధురం భుక్తం మధురం
దృష్తం మధురం సిష్తం మధురం
మథురా ధిపతె రఖిలం మధురం

గోపా మధురా గావో మధురా
యష్టిర్ మధురా సృష్టిర్ మధురా 
దలితం మధురం ఫలితం మధురం
మథురా ధిపతె రఖిలం మధురం




Thursday, February 12, 2015

Devadevam Bhaje

Devadevam Bhaje



dEva dEvam bhajE
divya prabhAvam
rAvaNAsura vairi raNapungavam rAmam

rAjavara SEkharam ravi kula sudhAkaram
aajAnubAhum nIlAbrakAyam
rajArikOdanDa rAjadeekshagurum
rAjeevalochaNam rAmachandram rAmam

pankajAsaNa vinuta parama nArayaNam 
SankarArjita janaka chApa daLaNam 
lankA viSoshanam lAlita vibhIshaNam
vEnkaTESam sAdhu vibhuda vinutam rAmam

దేవ దేవం భజే
దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం రామం

రాజవర శేఖరం రవి కుల సుధాకరం
ఆజానుబాహుం నీలాబ్రకాయం
రాజారికోదండ  రాజదీక్షగురుం
రాజీవలొచణం రామచంద్రం రామం

పంకజాసణ వినుత పరమ నారయణం 
శంకరార్జిత జనక చాప దళణం 
లంకా విశొషనం లాలిత విభీషణం
వేంకటేశం సాధు విభుద వినుతం రామం