Ittimudduladi Baludu
Pallavi:
iTTi muddulADi baluDEDa daagenO
vaani paTTi tecchi poTTaninDa paalu pOyarE
CharaNam:
gaamiDai paaritenchi kAgeDi vennalalOna chEmapuvvu kaDiyAla chEyipeTTi
cheema kuTTenanI tana chekkiTa kannirujaara..
vaemaru vaapoyevAni veDDu peTTare..
mucchuvalE vacchi tana mungamuruvula cheyyi taccheDi perugulona dagapeTTi
nocchenanI chEyi teesi noaranella jollu kaara..
voccheli vaapOvuvani nuuraDinchare..
eppudu vaccheno mA illu jocchi peTTelOni chepparAni ungarAla chEyipeTTi..
appaDaina vEnkaTAdri asavAlakuDugAna..
tappakunDa beTTe vaani talakettarE..
పల్లవి:
ఇట్టి ముద్దులాడి బలుడేడ దాగెనో
వాని పట్టి తెచ్చి పొట్టనిండ పాలు పోయరే
చరణం:
గామిడై పారితెంచి కాగెడి వెన్నలలోన చేమపువ్వు కడియాల చేయిపెట్టి..
చీమ కుట్టెననీ తన చెక్కిట కన్నిరుజార..
వేమరు వాపొయెవాని వెడ్డు పెట్టరె..
ముచ్చువలే వచ్చి తన ముంగమురువుల చెయ్యి తచ్చెడి పెరుగులొన దగపెట్టి..
నొచ్చెననీ చేయి తీసి నోరనెల్ల జొల్లు కార..
వొచ్చెలి వాపోవువని నూరడించరె..
ఎప్పుదు వచ్చెనొ మా ఇల్లు జొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయిపెట్టి..
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడుగాన..
తప్పకుండ బెట్టె వాని తలకెత్తరే...
No comments:
Post a Comment